వైయస్ జగన్ ప్రభంజనమే కారణం
29 Oct, 2012 13:11 IST
అనంతపురం:
కేంద్ర క్యాబినెట్‌లో రాష్ట్రానికి ఎక్కువ మంత్రి పదవులు రావడానికి వైయస్ జగన్ ప్రభంజనమే కారణమని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి వ్యాఖ్యానించారు. జైపాల్ రెడ్డికి శాఖ మార్చడం అప్రజాస్వామికమని ధ్వజమెత్తారు. సోమవారం పన్నెండో రోజు మరో ప్రజా ప్రస్థానం సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. మరో ప్రజా ప్రస్థానానికి వేలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారని ఆయన చెప్పారు. ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, గుర్నాథ్ రెడ్డి, అనంతపురం జిల్లా పార్టీ కన్వీనర్ శంకరనారాయణ, ఎల్ఎమ్ మోహన్ రెడ్డి, నేతలు తోపుదుర్తి ప్రకాశ రెడ్డి, కవిత, తదితరులు ప్రజా ప్రస్థానంలో పాల్గొంటున్నారు.