వైయస్ఆర్ కాంగ్రెస్‌లోకి స్వర్ణ సుధాకర్ రెడ్డి
23 Nov, 2012 10:35 IST
హైదరాబాద్:
మహబూబ్నగర్ జిల్లా ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్ రెడ్డి శుక్రవారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ లోటస్ పాండ్లో పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సమక్షంలో ఆమె పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. విజయమ్మ ఈ సందర్భంగా స్వర్ణ సుధాకర్ రెడ్డికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. స్వర్ణక్కతో పాటు పలువురు మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.