వైయస్ఆర్ కాంగ్రెస్‌కు స్పష్టమైన వైఖరుంది: జిట్టా
19 Dec, 2012 09:29 IST
హైదరాబాద్:
తెలంగాణ అంశంపై తమ పార్టీ స్పష్టమైన వైఖరితో ఉందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి చెప్పారు. మంగళవారం ఆయన చంచల్‌గుడా జైలులో శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అనంతరం, విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత పరిణామాలపై తమ నేతతో చర్చించానని తెలిపారు. తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగానే తమ పార్టీ నడుస్తుందనీ, ఈ అంశంలో శ్రీ జగన్ స్పష్టమైన వైఖరితో ఉన్నారనీ జిట్టా వివరించారు.