వైయస్ఆర్ కాంగ్రెస్ దీక్షకు పొత్తూరి సంఘీభావం

6 Apr, 2013 19:10 IST
హైదరాబాద్, 06 ఏప్రిల్ 2013: విద్యుత్తు చార్జీల పెంపునకు వ్యతిరేకంగా వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న దీక్షకు సీనియర్‌ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు సంఘీభావం తెలిపారు. 5 రోజుల దీక్ష ద్వారా ప్రజల సమస్యను పార్టీ చాటి చెప్పగలిగిందని ఈ సందర్భంగా పొత్తూరి అన్నారు. దీక్ష చేస్తున్న వారి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని చెప్పారు. మహానేత డాక్టర్ వైయస్‌ఆర్‌ అభిమానిగా దీక్ష విరమించాలని శ్రీమతి విజయమ్మసహా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఎవరో బలవంతంగా దీక్షను విరమింపజేయడం కన్నా తన సలహా మేరకు విరమించాలని కోరారు.