వైఎస్సార్ సీపీలో యువకుల చేరిక

27 Sep, 2012 07:25 IST

హైదరాబాద్: వై.యస్.జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంపై నమ్మకంతో యువత వైయస్ఆర్ సీపీలో చేరుతున్నారని ఆ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా ప్రతాపరెడ్డి చెప్పారు. హయత్‌నగర్ డివిజన్‌కు చెందిన పలువురు యువకులు బోడ శ్రవణ్ ఆధ్వర్యంలో పుత్తా సమక్షంలో పార్టీలో చేరారు. ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాలకోసం వైఎస్‌ఆర్ చేపట్టిన సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు.