లాల్ బహదూర్ శాస్త్రీకి వైయస్ జగన్ నివాళి
2 Oct, 2017 12:24 IST
హైదరాబాద్ః
గొప్ప నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తి మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రీ అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కొనియాడారు. లాల్ బహదూర్ శాస్త్రీ జయంతి సందర్భంగా వైయస్ జగన్ ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. `జై కిసాన్.. జై జవాన్ అనే నినాదాన్ని స్మరించుకుంటూ.. నేటి యువతకు ఆయన ఆదర్శప్రాయుడన్నారు. అలాగే స్వాతంత్ర్య సమరంలో ముఖ్య భూమిక పోషించారు.