మాజీ రాష్ట్ర పతి కలాం జయంతి వేడుకలు
15 Oct, 2018 14:50 IST
మాజీ రాష్ట్ర పతి ఎపిజె అబ్దుల్ కలాం జయంతిని వైయస్ ఆర్ కడప జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీకాంత రెడ్డి , కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారత దేశాన్ని ప్రచండ శక్తిగా చూడాలనుకున్న కలాం ఆశయాలను నెరవేర్చడమే ఆయనకు మనమిచ్చే ఘన మైన నివాళి అన్నారు. కర్మయోగి,నిష్కళంక ఋషి, భరతమాత కు ప్రియమైన పుత్రుడు కలాం అని, ఆయన సానుకూల దృక్పథం తరతరాలకు అనుకరణం, ఆచరణీయమన్నారు.