చంద్రబాబు పాలనలో వ్యాపారులు కష్టాలపాలు..
9 Dec, 2018 11:57 IST
వైయస్‌ఆర్‌సీపీ వాణిజ్య విభాగం నేతలు..
విశాఖః చంద్రబాబు పాలనలో వ్యాపారులు కష్టాల పాలయ్యారని వైయస్‌ఆర్‌సీపీ వాణిజ్య విభాగం నేతలు కుప్పం ప్రసాద్, శ్యాంకుమార్ రెడ్డి మండిపడ్డారు. చంద్రన్న మాల్స్,హెరిటేజ్ మాల్స్‌ను ప్రోత్సహించడంతో చిరువ్యాపారుల జీవితాలు నాశనమయ్యాయన్నారు.జీఎస్టీపై వ్యాపారులకు స్పష్టమైన అవగాహన కల్పించలేదన్నారు.వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే వైశ్య కార్పొరేషన్ ద్వారా చిరు వ్యాపారులను ఆదుకుంటామన్నారు.