నేడు వెన్నపూస వేణుగోపాల్‌రెడ్డి నామినేషన్
15 Feb, 2017 12:10 IST
అనంతపురం: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి స్థానానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వెన్నపూస వేణుగోపాల్‌రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. అనంతపురం జిల్లా కలెక్టరెట్‌లో ఆయన తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పట్టభద్రులు, పార్టీ శ్రేణులు హాజరుకానున్నారు.