'టిడిపి, టిఆర్‌ఎస్ పార్టీలకు జగ‌న్ ఫోబియా'

10 Jan, 2013 13:51 IST
హైదరాబా‌ద్‌, 10 జనవరి 2013: టిడిపి, టిఆర్‌ఎస్‌ పార్టీల నాయకులకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఫోబియా పట్టుకుందని వైయస్‌ఆర్‌సిపి సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి జ్యోతుల నెహ్రూ ఎద్దేవా చేశారు. రాజకీయంగా వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఎదుగుదల నుంచి చూసి ఓర్వలేక అక్బరుద్దీ‌న్‌ ఒవైసీ వ్యాఖ్యల విషయంలో ఆ రెండు పార్టీలు తమ పార్టీని తప్పుబడుతున్నాయని నెహ్రూ ధ్వజమెత్తారు. అక్బరుద్దీన్ వాఖ్యలను తమ పార్టీ ‌నాయకులు ఖండించారని ఆయన గుర్తు చేశారు.

ఇతర మతాన్ని కించపరిచేలా చేసిన అక్బరుద్దీన్ వ్యాఖ్యలను తమ పార్టీ ఇప్పటికీ గట్టిగా వ్యతిరేకిస్తోందని జ్యోతుల నెహ్రూ అన్నారు. ‌శ్రీ జగన్ ఫోబియా పట్టుకున్న కారణంగానే విలువలు లేకుండా టిడిపి, టిఆర్‌నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారని నెహ్రూ ఆగ్రహం వ్యక్తం చేశారు.