ఇంకెంత కాలం ఈ మోసాలు
21 Jan, 2016 13:39 IST
గుంటూరు: గుంటూరు జిల్లా తుళ్లూరులో... రాజధాని మాస్టర్‌ప్లాన్‌పై అధికారులు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సును రైతులు అడ్డుకున్నారు.
హామీలు నెరవేర్చేవరకు సదస్సు జరపడానికి వీల్లేదంటూ ఆగ్రహించారు. ఎంతకాలం తమను మోసం చేస్తారంటూ అధికారులను రైతులు నిలదీశారు.
రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి భూములు బలవంతంగా లాక్కోవడం మొదలు వారిని అన్ని విధాలుగా పచ్చప్రభుత్వం క్షోభకు గురిచేస్తోంది. కూడు,గూడు, భూమి అంతా లాగేసుకొని ముప్పుతిప్పలు పెడుతున్న ప్రభుత్వంపై రైతులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.