నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు
25 Mar, 2016 08:44 IST
నెల్లూరు) నెల్లూరు లో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ సభను విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలకు పార్టీ నాయకులు ఆనం విజయ కుమార్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. స్థానిక చింతారెడ్డిపాళెంలోని ఆయన నివాసంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. సభ విజయవంతానికి కృషి చేసిన పార్టీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అందరు ఒకేతాటిపై నడిచి పార్టీని విజయతీరాలకు చేర్చుతామన్నారు. సభకు హాజరైన నెల్లూరు, తిరుపతి, ఒంగోలు ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాద్, వైవీ సుబ్బారెడ్డి, జెడ్పీచైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పాశం సునీల్‌కుమార్, కిలివేటి సంజీవయ్య, మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
To read this article in English: http://goo.gl/ChFE33