నింబధనలు కాలరాస్తున్న టీడీపీ

21 Dec, 2015 10:55 IST

అసెంబ్లీః ప్రజాసమస్యలపై చర్చ జరిగితే తమ అవినీతి, అక్రమాలు, అరాచకాలు బయటపడతాయన్న దురుద్దేశ్యంతో అధికారపక్షం సభ్యులు ప్రతిపక్షం గొంతు నొక్కుతూ సభలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు.  ఎదురుదాడే లక్ష్యంగా చర్చ జరగకుండా వైఎస్సార్సీపీ సభ్యులను అడ్డుకుంటున్నారు. ఈక్రమంలోనే  ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, మైక్ కట్ చేయడం, నిబంధనలను కాలరాస్తూ మహిళా శాసనసభ్యురాలిని ఏడాది పాటు సస్పెండ్ చేయడం, ప్రతిపక్షం మొత్తాన్ని సస్పెండ్ చేస్తూ ఇష్టారీతిగా సభ నడుపుకుంటున్నారు.  బీజేపీ, టీడీపీ నాయకులు పరస్పరం పొగడ్తలతో ముంచేసుకుంటూ సభను కొనసాగించుకోవడం దురదృష్టకరం.