ఇసుక పేరుతో దోపిడీ :వైఎస్ జగన్
30 Mar, 2016 12:05 IST
హైదరాబాద్) శాసనసభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఇసుక మాఫియా గురించి ప్రస్తావించారు. రెండేళ్ల పాటు ఇసుకను దోచేసుకొన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని మంత్రి యనమలే స్వయంగా చెప్పారని వివరించారు. 2 వేల కోట్ల రూపాయిల కుంభకోణం అని మంత్రే స్వయంగా చెప్పారని చెప్పారు. వివరాలు చెబుతుండగానే అధికార పక్షం అడ్డు తగిలింది.