బాబు ఇంటి ముందు దీక్ష చేయండి: భూమా
27 Aug, 2013 14:50 IST
కర్నూలు, 27 ఆగస్టు 2013:
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా దీక్షలు చేస్తున్న టిడిపి నాయకులు చంద్రబాబు ఇంటి ముందు చేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి సూచించారు. రాష్ట్ర విభజన వెనుక కుట్ర దాగి ఉందని నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసి రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాయని ఆయన మండిపడ్డారు.
సమైక్యాంధ్ర నినాదంతో చిన్నారులు, వృద్ధులు కూడా రోడ్డు మీదకు వచ్చి ఉద్యమం చేస్తుంటే చంద్రబాబు నాయుడు మాత్రం ఇంట్లో దాక్కున్నారని భూమా నాగిరెడ్ఢి విరుచుకుపడ్డారు. మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేందుకు కాంగ్రెస్, టిడిపి చేస్తున్న కుట్రలను ప్రజలే తిప్పికొడతారని నాగిరెడ్డి హెచ్చరించారు.