టీడీపీ నేతలు వైయస్ఆర్‌సీపీలో చేరిక
15 Sep, 2017 18:31 IST
పుట్టపర్తి: పుట్టపర్తి నగర పంచాయతీ పరిధిలోని బీడుపల్లిలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు శుక్రవారం వైయస్ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమంలో భాగంగా పార్టీ పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త దుద్దకుంట శ్రీధర్‌రెడ్డి గ్రామానికి వెళ్లిన సమయంలో పలువురు కార్యకర్తలు పార్టీలో చేరారు. బీడుపల్లికి చెందిన ఆదినారాయణ, చిరంజీవి, శ్రీనివాసరెడ్డి, నరసింహులు తదితర 15 కుటుంబాలకు చెందిన వారు పార్టీలోకి చేరారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్లు మాధవరెడ్డి, గంగాద్రి, కౌన్సిలర్లు ఈశ్వరయ్య,నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు.