వైయస్ఆర్ సీపీలోకి టీడీపీ నేతలు
6 Mar, 2017 15:08 IST
ఇచ్చాపురం: శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్స్ ప్రియ, సాయిరాజ్ ఆధ్వర్యంలో ఇచ్చాపురం నియోజకవర్గం రత్తకన్న గ్రామానికి చెందిన పలువురు వైయస్ఆర్ సీపీలో చేరారు. ఈ మేరకు వారు వైయస్ఆర్ సీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. అనంతరం పార్టీ కోఆర్డినేటర్ వారు మాట్లాడుతూ.. చంద్రబాబు చేసిన మోసాల ఫలితమే వైయస్ఆర్ సీపీలోకి వలసలని చెప్పారు. రానున్న రోజుల్లో టీడీపీ జెండా మోయడానికి ఎవరూ ఉండరని ఎద్దేవా చేశారు.