టీడీపీ నాయకులు వైయస్ఆర్‌సీపీలో చేరిక
25 Apr, 2018 12:34 IST
విశాఖ: విజయనగరం టీడీపీ కార్యకర్తలు వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఎమ్మెల్సీ వీరభద్రస్వామి, చినశ్రీను సమక్షంలో వైయస్ఆర్ సీపీలో చేరారు. గుత్తిరాల వెంకటేశ్వరరావు, కొండపల్లి సునీల్, కోకర్ల మస్తాన్ చౌదిరి,మయనేన మోషన్‌సాయి,పెలిశేటి రమేష్,పర్వతనేని సత్యనారాయణ,కడియాల రామకృష్ణ(ఆర్.కె) పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సైనికుళ్లా పని చేయాలని పిలుపునిచ్చారు.