ఎంవీ రాజశేఖర్ రెడ్డి..బీఎస్ జగన్ వైయస్ఆర్‌సీపీలో చేరిక
6 Oct, 2018 12:31 IST
చిత్తూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ఆకర్శితులై వివిధ పార్టీల నాయకులు వైయస్ఆర్‌సీపీలో చేరుతున్నారు. తాజాగా పలమనేరు పట్టణానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు వైయస్ఆర్‌సీపీలో చేరారు. నియోజకవర్గ కో–ఆర్డినేటర్ వెంకటేగౌడ ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పట్టణానికి చెందిన టీడీపీ కీలకనేతలు ఎంవీ రాజశేఖర్ రెడ్డి అలియాస్ పెయింట్ రెడ్డి, బీఎస్ జగన్ 500 మంది అనుచరులతో వైయస్ఆర్ సీపీలో చేరారు. పెద్దిరెడ్డి వారికి పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి అధినేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డి , పెద్దిరెడ్డి చేస్తున్న పోరాటాలకు ఆకర్షితులై వైయస్ఆర్ సీపీలో చేరామని వారు తెలిపారు. పార్టీలో చేరినవారిలో పట్టణానికి చెందిన మారెమ్మగుడి, బోయవీధి, పల్లెవీధి, ఎంసీపాళెం, అంబేడ్కర్‌నగర్, శ్రీనగర్‌కాలనీ, గంటావూరు, శ్రీలంకకాలనీ, డ్రైవర్స్ కాలనీకి చెందిన భాస్కర్, బుజ్జి, ముజ్జు, హేమంత్, ఈశ్వర, చైతు,హరి,శీనా, రమేష్,మణి, లోక, సునీల్, ఖాదర్, సంతోష్, శేఖర, బాబు,అస్లాం, శామ్యూల్ తదితరులు ఉన్నారు. పార్టీ పట్టణ కన్వీనర్ మండీ సుధా, మారెమ్మగుడివీధి జగ్గా తదితరులు పాల్గొన్నారు.