ఇదొక కా.మ. వ్యవహారం

14 Jan, 2016 20:25 IST
గుంటూరు : గుంటూరు జిల్లా నరసరావు పేటలో అధికార టీడీపీ కి  చెందిన కౌన్సిలర్, అతని సోదరుడు నూతన చిట్స్‌ను ప్రారంభించారు. వేడుకల్లో భాగంగా వినుకొండ రోడ్డులోని ఓ ఫంక్షన్‌హాల్‌లో మందు పార్టీ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మహిళలతో అసభ్యకర డాన్స్‌లు చేయించారు. హాజరైన చీటీపాట సభ్యులు కార్యక్రమాలను ఫోన్‌లో చిత్రీకరించి ఇతరులకు వాట్స్‌ఆప్ ద్వారా పంపారు.కొందరు ఈ విషయాన్ని పోలీసు అధికారుల దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించిన అధికారులు అక్కడకు చేరుకున్నారు. ఈ వేడుకల్లో పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు ఉన్నారు. పోలీసుల రాకను గమనించిన వారు అక్కడ నుంచి మెల్లగా జారుకున్నారు. కార్యక్రమాన్ని నిలిపివేయాలని పోలీసులు సూచించినప్పటికీ కార్యక్రమాన్ని కొనసాగించడంతో నిర్వాహకులపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈలోగా పచ్చ పార్టీ నేతల  నుంచి ఒత్తిళ్లు రావడంతో నిర్వాహకులను స్టేషన్‌కు రావాలని ఆదేశించి అక్కడ నుంచి వెళ్లిపోయారు.   ఇటువంటి వాటిని అనుమతించబోమని తర్వాత పోలీసు అధికారులు చెప్పారు.