టీడీపీ నేతల బ్లాక్ మెయిల్

12 Dec, 2015 17:08 IST
హైదరాబాద్ : కాల్ మనీ వ్యవహారంలో పోలీసులను టీడీపీ నేతలు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని వైఎస్సార్సీపీ  నేత సామినేని ఉదయభాను ఆరోపించారు. కృష్ణాజిల్లాలో కాల్మనీ వ్యవహారంపై స్పందించిన ఉదయభాను ... ఈ వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సహా పలువురు టీడీపీ నేతల హస్తముందన్నారు.

చంద్రబాబు పర్యటనల్లో కాల్మనీ సూత్రధారులదే హడావుడి అని ఆయన చెప్పారు. పేదల రక్తం తాగుతున్న కాల్మనీ నిందితులను ఉరి తీసినా తప్పు లేదని ఉదయభాను అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారంపై నోరు విప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబును సామినేని ఉదయభాను డిమాండ్ చేశారు.