వైఎస్సార్సీపీ నాయకుడిపై పచ్చనేతల దాడి
27 Apr, 2016 11:51 IST
చిత్తూరు(రామకుప్పం): రాష్ట్రంలో పచ్చనేతల ఆగడాలు రోజురోజుకు శృతిమించుతున్నాయి. తమ దందాకు అడ్డువస్తున్నాడనే అక్కసుతో వైఎస్సార్‌సీపీ నేతపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం బల్ల గ్రామంలో ఈఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పెరియప్ప పొలానికి వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఆయన కేకలు వేయటంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. దీంతో నిందితులు పరారయ్యారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.