వైయస్‌ఆర్ సీపీ కౌన్సిలర్‌పై దాడి
23 Oct, 2017 13:18 IST
అనంతపురం: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మంటగలిసిపోతుంది. అధికారం అండతో టీడీపీ నేతలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలుపుతున్న ప్రతిపక్ష పార్టీ నేతలపై టీడీపీ నేతలు దాడికి దిగారు. హిందూపురంలో మద్దిరెడ్డిపల్లి వాసుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మేలాపురం క్రాస్‌రోడ్డులో వైయస్‌ఆర్ సీపీ నేతలు రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేయడాన్ని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు ఆగ్రహంతో వైయస్‌ఆర్ సీపీ కౌన్సిలర్ నాగభూషణంపై దాడి చేశారు. టీడీపీ నేతల ఆగడాలను అరికట్టాలని కోరుతూ పార్టీ నేతలు పెద్ద పెట్టున నినదించారు.