రోజా సస్పెన్షన్ సరి కాదు

20 Dec, 2015 17:47 IST


హైదరాబాద్ ) అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే రోజాను ఏడాదిపాటు సస్పెండ్ చేయటం సరైన నిర్ణయం కాదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం అభిప్రాయ పడ్డారు. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

 రోజా అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావును దూషిస్తూ వ్యాఖ్యలు చేయలేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మాత్రమే విమర్శించారని చెప్పారు. రోజాపై ఉన్న సస్పెన్షన్‑ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రోజా అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావును దూషిస్తూ వ్యాఖ్యలు చేయలేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మాత్రమే విమర్శించారని చెప్పారు. గతంలో కరణం బలరాం నేరుగా స్పీకర్‑ను తిట్టారని, చంద్రబాబు గతంలో స్పీకర్‑ను రౌడీ స్పీకర్ అంటూ ముషారఫ్‑తో పోల్చారని చెప్పారు.

అసెంబ్లీలో నిబంధనలు, సంప్రదాయాలు పాటించడంలేదని తమ్మినేని విమర్శించారు. శాసనసభ చరిత్రలో ఇలాంటి పరిస్థితులను ఎన్నడూ చూడలేదని అన్నారు. మంత్రి యనమల రామకృష్ణుడు తమ నిర్ణయమే ఫైనల్ అని చెబుతున్నారని, సభలో ప్రతిపక్షం అవసరం లేదా అని ప్రశ్నించారు. లోక్‑సభ, రాజ్యసభలో ఉన్న నిబంధనలే ఇక్కడా ఉన్నాయని చెప్పారు.