శుక్రవారం నాటి యాత్ర 14.8 కిమీ

14 Feb, 2013 13:47 IST
నల్గొండ 14 ఫిబ్రవరి 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి శ్రీమతి వైయస్ షర్మిల శుక్రవారంనాడు 14.8 కిలోమీటర్లు నడుస్తారు. మరో ప్రజా ప్రస్థానం కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లాలో ఆమె పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం అలీనగర్ నుంచి యాత్ర ఆరంభమవుతుంది. వెంకటాద్రినగర్, నిడమానూర్, నరసింహలగూడెం వరకూ నడిచిన అనంతరం ఆమె భోజన విరామం తీసుకుంటారు. బొక్కముంతలపాడు, ముకుందాపురం వరకూ పాదయాత్ర చేసిన అనంతరం రాత్రి బసకు తరలుతారని కార్యక్రమ సమన్వయకర్త తలశిల రఘురాం తెలిపారు.