దమ్ముంటే ఆదినారాయణరెడ్డి రాజీనామా చేయాలి

11 Nov, 2017 11:24 IST
 జమ్ములమడుగు ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ సుధీర్‌రెడ్డి
వైయస్‌ఆర్‌ జిల్లా: మంత్రి ఆదినారాయణరెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు రావాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జమ్ములమడుగు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ సుధీర్‌రెడ్డి సవాల్‌ విసిరారు. వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్పయాత్ర ఐదో రోజు సుధీర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పుణ్యనా ఆదినారాయణరెడ్డి ఎమ్మెల్యే అయ్యారన్నారు. 2014 ఎన్నికల సమయంలో వైయస్‌ఆర్‌ ఇంటి వద్ద కాపలా ఉండి వైయస్‌ జగన్‌తో టికెట్టు ఇప్పించుకున్నారన్నారు. ఆదినారాయణరెడ్డి గెలుపునకు మేమంతా కృషి చేస్తే..ఇవాళ చంద్రబాబు ఇచ్చే డబ్బుకు ఆశపడి టీడీపీలో చేరారని విమర్శించారు. ఆదినారాయణరెడ్డి ఓ దొంగ, దోపిడి వ్యక్తి అని అభివర్ణించారు. వైయస్‌ జగన్‌ పాదయాత్రకు వస్తున్న జనాధరణ చూసి ఓర్వలేక పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని ఖండించారు.  ఆదినారాయణరెడ్డి తన సొంత అన్న నారాయణరెడ్డినే మోసం చేశాడని ఆరోపించారు. ఆయనకు  ఊరూరా పది మంది పేర్లు కూడా గుర్తు ఉండవని చెప్పారు.  ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు వస్తే మేం సిద్ధంగా ఉన్నామని సుధీర్‌రెడ్డి చాలెంజ్‌ చేశారు.