సుద్దపల్లి నుంచి ప్రారంభమైన షర్మిల పాదయాత్ర

17 Mar, 2013 10:05 IST
గుంటూరు, 17 మార్చి 2013: మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి తనయ, జననేత శ్రీ జగన్మహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం 93వ రోజు పాదయాత్ర ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం సుద్దపల్లి నుంచి ప్రారంభమైంది. శ్రీమతి షర్మిల పాదయాత్ర ఆదివారంనాడు పొన్నూరు నియోజకవర్గంలో సాగుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గుంటూరు జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖ‌ర్, పార్టీ ‌కార్యక్రమాల రాష్ట్ర సమన్వయకర్త తలశిల రఘురామ్ తెలిపారు.

శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర‌గా సుద్దపల్లి, ఎస్సీ కాలనీ, శలపాడు మీదుగా భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారని వారు వివరించారు. భోజన విరామం అనంతరం తెనాలి క్రాస్‌రోడ్ నుంచి వడ్లమూడి మీదుగా చేబ్రోలు చేరుకుంటారు. చేబ్రోలులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో శ్రీమతి షర్మిల ప్రసంగిస్తారు. అనంతరం రాత్రి బసకు చేరుకుంటారు.