యూపీ సీఎం అఖిలేశ్‌తో 6న జగన్ భేటీ
4 Dec, 2013 14:27 IST
హైదరాబాద్:
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఈ నెల 6న లక్నో వెళ్ళి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌ను కలుకుంటారు. సమైక్యాంధ్రకు మద్దతు తెలపాలని ఈ సందర్భంగా అఖిలేశ్‌ను శ్రీ జగన్ కోరతారు. లక్నో వెళ్లేందుకు శ్రీ జగన్కు సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారంనాడు అనుమతి మంజూరు చేసింది.
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టడంలో భాగంగా శ్రీ జగన్ బుధవారం చెన్నై వెళ్ళారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ఆయన కలుసుకున్నారు. జనతాదళ్ (ఎస్) అధినేత దేవెగౌడను 5న (గురువారం) బెంగళూరులో కలిసేందుకు అనుమతించాలంటూ శ్రీ జగన్ పిటిషన్ దాఖలు చేశారు.