పడవ మృతుల కుటుంబాలకు జగన్ సాయం
రాజమండ్రి, 4 జూన్ 2014:
ధవళేశ్వరం గోదావరి నదిలో మంగళవారం జరిగిన పడవ ప్రమాదం దుర్ఘటనలో మృతి చెందిన కుటుంబాలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి పరామర్శించారు. తూర్పు గోదావరి రాజమండ్రిలో జరుగుతున్న పార్టీ సమీక్షా సమావేశానికి హాజరయ్యేందుకు శ్రీ జగన్ రాజమండ్రి వచ్చారు. ఈ సందర్బంగా రాజమండ్రి సమీపంలోని ధవళేశ్వరం వద్ద గోదావరిలో పడవ తిరగబడి మృతిచెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన ఒక్కో కుటుంబానికి పార్టీ తరఫున శ్రీ జగన్ లక్ష రూపాయిల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు.
ఇదే జిల్లాలోని మధురపూడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మరో రెండు బాధిత కుటుంబాలను కూడా శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి పరామర్శించారు. ఆయా బాధిత కుటుంబాలకు కూడా ఆయన రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని శ్రీ జగన్ ఈ సందర్బంగా భరోసా ఇచ్చారు. ఈ రెండు ప్రమాదాల్లో మరణించిన మొత్తం ఏడుగురి కుటుంబాలనూ ఆయన పరామర్శించి, ఆర్థిక సాయం అందజేశారు.