రాష్ట్ర ప్రజలకు జగన్ దీపావళి శుభాకాంక్షలు

2 Nov, 2013 13:07 IST
హైదరాబాద్, 2 నవంబర్ 2013:

చీకటిపై వెలుగు విజయం సాధించడమే దీపావళి అని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి అని పేర్కొన్నారు. లోక కంటకుడైన నరకాసురుడిపై శ్రీకృష్ణుడు, సత్యభామ సాధించిన విజయానిని దీపావళి చిహ్నం అన్నారు. రాష్ట్ర ప్రజలు, ప్రపంచంలోని తెలుగువారందని జీవితాలూ కాంతులతో నిండాలని ఆయన ఆకాంక్షించారు. దీపావళి పండుగ సందర్భంగా శ్రీ జగన్‌ శనివారంనాడు ఒక ప్రకటనలో అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.