మహానేత వైయస్‌కు జననేత జగన్ నివాళులు
9 నవంబర్ 2013: దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డికి ఆయన తనయుడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి శనివారం నివాళులు అర్పించారు. శ్రీ జగన్ సతీమణి శ్రీమతి భారతితో కలిసి శనివారం ఉదయం ఇడుపులపాయలోని వైయస్ఆర్ సమాధి వద్దకు చేరుకున్నారు. అనంతరం వారిద్దరూ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
జగన్‌కు ఘన స్వాగతం :
శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఇడుపులపాయ వచ్చిన సందర్భంగా వచ్చిన పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలను ఆయన పేరు పేరునా పలకరించారు. కాగా సుదీర్ఘ విరామం తర్వాత జిల్లాకు వచ్చిన శ్రీ వైయస్ జగన్‌కు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పులివెందుల బయల్దేరి వెళ్ళారు.
20 నెలల సుదీర్ఘ ఎడబాటు అనంతరం శ్రీ జగన్ శనివారం పులివెందులలో అడుగుపెట్టారు. 2012 ఫిబ్రవరి 11న రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఇడుపులపాయ, పులివెందులలో గడిపారు. తర్వాత సీబీఐ కేసుల నేపథ్యంలో అరెస్టయ్యారు. ఈ ఏడాది సెప్టెంబర్ 24న కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి వెంకటాద్రి ఎక్సుప్రెస్లో ఎర్రగుంట్లలో దిగిన ఆయన అక్కడ నుంచి ఇడుపులపాయ చేరుకున్నారు.