పోలవరం పనులు వేగవంతం చేయాలి
22 Dec, 2017 12:53 IST
ఢిల్లీ:
పోలవరం పనులను వేగవంతం చేయాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కోరారు. ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వై. విజయసాయిరెడ్డి, వరప్రసాద్, వైయస్ అవినాష్‌రెడ్డిలు కేంద్రమంత్రి గడ్కరీని కలిశారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు స్థితిగతులను మంత్రికి వివరించారు. రాష్ట్రానికి పోలవరం జీవనాడి అని దాన్ని త్వరగా పూర్తి చేసి రైతులను ఆదుకోవాలన్నారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ప్రాజెక్టు పూర్తి చేయాలని కోరారు.