హోదా మిఠాయి కొట్టు...ప్యాకేజి మిఠాయి పొట్లం

2 Jun, 2018 15:09 IST

నెల్లూరు : ప్రత్యేక హోదా అనే పెద్ద మిఠాయి కొట్టు.. ప్యాకేజీ అనేది చిన్న మిఠాయి పొట్లాం లాంటి దని సినీ నటుడు పృథ్వీ అన్నారు. నెల్లూరు వంచన పై గర్జన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలంటే వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని ఆయన  అన్నారు. ఏ పోరాటమైనా మొదటి అడుగుతోనే మొదలవుతుందని అన్నారు. పాదయాత్రలో వైయస్‌ జగన్‌ను కలిసినప్పుడు ఆయనంటే ఏంటో తెలిసిందని పేర్కొన్నారు. చంద్రబాబు ఎన్నిసార్లు ప్రత్యేక హోదాపై యూ టర్న్‌ తీసుకుంటారని ప్రశ్నించారు. సినిమా వాళ్లందర్నీ సామాన్య పార్టీ కార్యకర్తలగానే చూడాలని ఆయన పిలుపునిచ్చారు. వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేస్తే సగం కష్టాలు తీరిపోతాయని చెప్పారు. ఆయనలోని దృఢ నిశ్చయం, పోరాటం ఎవరిలోనూ తాను చూడలేదన్నారు.