వైయస్‌ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు..
24 Dec, 2018 10:35 IST
వైయస్‌ఆర్ జిల్లాః కిస్మస్‌ను పురస్కరించుకుని ఇడుపులపాయలోని వైయస్‌ఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబసభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైయస్‌ఆర్ జీవించి ఉన్న కాలంలో ప్రతి ఏటా క్రిస్మస్‌కు ముందురోజు కుటుంబ సభ్యులంతా ఇడుపులపాయలో కలవడం అనవాయితీ. వైయస్ జగన్ పాదయాత్రలో ఉన్న కారణంగా వైయస్ విజయమ్మతో పాటు మిగతా కుటుంబసభ్యులు ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వైయస్ విజయమ్మ వైయస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళర్పించారు.