సోమవారం యాత్ర 13 కి.మీ.
6 May, 2013 10:27 IST
ఖమ్మం, 06 మే 2013:
దివంగత మహానతే డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర 140వ రోజుకు చేరింది. ఆమె ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో పాదయాత్ర సాగిస్తున్న సంగతి తెలిసిందే. పాదయాత్రలో భాగంగా సోమవారం ఆమె కొత్తగూడెం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సింగరేణి మెయిన్ హాస్పిటల్ నుంచి సోమవారం ఉదయం యాత్రను ఆరంభించారు. టిటిడి మంటపం, హెడ్ ఆఫీస్, రామవరం, 3ఇన్‌క్లైన్, 4ఇన్‌క్లైన్ పాలిటెక్నిక్ కాలేజ్, 5ఇన్‌క్లైన్ మీదుగా వెడతారు. మొత్తం 13 కిలోమీటర్ల మేర శ్రీమతి షర్మిల నడుస్తారు.