సమస్యల పరిష్కారానికి కృషి
18 May, 2017 12:16 IST
శ్రీకాళహస్తిః స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే...వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని వైయస్‌ఆర్‌సీపీ నేత, తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్‌రావు అన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీరామనగర్ కాలనీలో ఉన్న పార్టీ కార్యాలయంలో మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు అందుబాటులో ఉంటామని ఆయన తెలియజేశారు. ఆ సమయంలో స్థానికులు తమ సమస్యలను వివరిస్తే...సంబందిత అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కరిస్తామన్నారు. అందరు ఈ అవకాశాన్ని సద్వినియాగం చేసుకోవాలని ఆయన కోరారు.