ఆదివారం మరో ప్రజాప్రస్థానం షెడ్యూల్ ఇదీ
28 జూలై 2013 : వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 223వ రోజు షెడ్యూల్‌ను పార్టీ కార్యక్రమాల కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ ధర్మాన కృష్ణప్రియ వివరించారు.
ఆదివారం ఉదయం శ్రీమతి షర్మిల శ్రీకాకుళం జిల్లా అంగూరు నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. జిల్లాలో ఆమె 8వ రోజు పాదయాత్ర చేస్తున్నారు. అంగూరు నుంచి పాదయాత్ర అద్దానవలస, వెంకటాపురం, వడ్డినవలస, అలుదు గ్రామాల మీదుగా సారవకోట చేరుకుంటుంది. సారవకోటలో భోజన విరామం తర్వాత బురుజువాడ, కురుడుంగి, చింతకట్లపాడు, బొంతు గ్రామాల మీదుగా ధర్మలక్ష్మీపురం చేరుకుంటుంది. ధర్మలక్ష్మీపురం సమీపంలో శ్రీమతి షర్మిల ఆదివారం రాత్రికి బస చేస్తారు. శ్రీమతి షర్మిల ఆదివారంనాడు మొత్తం 14.3 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారని రఘురాం, పద్మప్రియ తెలిపారు.