మునిగిన వరిచేలను పరిశీలించిన విజయమ్మ
29 Oct, 2013 10:50 IST
జగ్గంపేట (తూ.గో.జిల్లా),
29 అక్టోబర్ 2013: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ తూర్పుగోదావరి జిల్లా పర్యటన మంగళవారం ఉదయం జగ్గంపేట నుంచి ప్రారంభమైంది. జగ్గంపేటలో ఆమె ముందుగా మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆ తరువాత సమైక్యాంధ్ర కోసం దీక్షలు చేస్తున్న సర్పంచ్‌ల సంఘం శిబిరాన్ని ప్రారంభించారు.
జగ్గంపేట నుంచి శ్రీమతి విజయమ్మ నేరుగా కాట్రామలపల్లి చేరుకున్నారు. భారీ వర్షాలకు నీట మునిగిన వరి చేలను పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి, వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులకు తగిన న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. కాట్రామలపల్లి నుంచి బిక్కవోలు, కాకినాడలో పర్యటిస్తారు.