పైడివాడ నుంచి ప్రారంభమైన షర్మిల పాదయాత్ర
3 జూలై 2013: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం 198వ రోజు పాదయాత్ర బుధవారం ఉదయం ప్రారంభమైంది. విశాఖ జిల్లా, పెందుర్తి నియోజకవర్గంలోని పైడివాడ నుంచి ఆమె పాదయాత్ర ప్రారంభించారు. బుధవారంనాటి మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర షెడ్యూల్ వివరాలను పార్టీ కార్యక్రమాల కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, విశాఖ నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రకటించారు.
పైడివాడ, జగన్నాధపురం, పెదగొల్లలపాలెం, లంకినరపాడు, అజరగిరి, వెదుళ్లనర్వ వరకూ శ్రీమతి షర్మిల పాదయాత్ర చేస్తారు. వెదుళ్ళనర్వ వద్ద ఆమె మధ్యాహ్న భోజనం చేస్తారు. భోజనానంతరం శ్రీమతి షర్మిల గాజువాక నియోజకవర్గంలోని దువ్వాడ 1 సెంటర్, రాజీవ్‌నగర్, ముస్తఫా సెంటర్, వడ్లపూడి సెంటర్, శ్రీనగర్ వరకూ నడుస్తారు. బుధవారం రాత్రికి శ్రీమతి షర్మిల శ్రీనగర్‌లో బస చేస్తారని రఘురాం, శ్రీనివాస్ తెలిపారు. బుధవారం నాడు శ్రీమతి షర్మిల మొత్తం 15.7 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారని వారు వివరించారు.