సబ్బవరంలో నేడు షర్మిల బహిరంగ సభ
2 జూలై 2013: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం 197వ రోజుకు చేరింది. నేటి షెడ్యూల్ ప్రకారం ఆమె పెందుర్తి నియోజకవర్గంలోని అయ్యన్నపాలెం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీమతి షర్మిల తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తలపెట్టిన 'ఉత్తరాంధ్ర సుజల స్రవంతి' ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ఈ ప్రాజెక్టు వివరాలను శ్రీమతి షర్మిలకు వివరించారు.
వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ గొల్ల బాబూరావు వెల్లడించిన వివరాల ప్రకారం శ్రీమతి షర్మిల మంగళవారం నాటి పాదయాత్ర షెడ్యూల్ ఇలా ఉంది. పెందుర్తి నియోజకవర్గంలోని అయ్యన్నపాలెం నుంచి పాదయాత్ర మొదలుపెట్టిన శ్రీమతి షర్మిల గుల్లేపల్లి మీదుగా సాగి పెదనాయుడుపాలెం సమీపంలో మధ్యాహ్న భోజన విరామానికి ఆగుతారు. భోజన విరామం అనంతరం పాదయాత్రగా వెళ్ళి సబ్బవరం చేరుకుంటారు. సబ్బవరంలో నిర్వహించే బహిరంగ సభలో శ్రీమతి షర్మిల ప్రసంగిస్తారని రఘురాం, బాబూరావు వివరించారు. అనంతరం అసకపల్లి మీదుగా పైడివాడ చేరుకుంటారు. మంగళవారం రాత్రికి ఆమె పైడివాడ సమీపంలో బస చేస్తారు.