షర్మిల నేటి మరో ప్రజాప్రస్థానం 18.6 కిమీ
31 జూలై 2013: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జననేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల బుధవారం 226వ రోజున మొత్తం 18.6 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు. శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 226వ రోజు షెడ్యూల్ వివరాలను పార్టీ కార్యక్రమాల కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియ వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాలో 11వ రోజు బుధవారం ఉదయం ఆమె పట్టుపురానికి సమీపంలోని బస నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు.
అక్కడి నుంచి శ్రీమతి షర్మిల జాడుపల్లి మీదుగా కొనసాగుతుంది. జాడుపల్లి వద్ద భోజన విరామం తీసుకుంటారు. ఆ తర్వాత ఆమె తూముకొండ, పెద్దమడి, హీరాపురం, చీపురుపల్లి, రేగలపాడు, టెక్కలిపట్నం, మోదుగులపుట్టి మీదుగా వీరభద్రపురం చేరుకుంటారు. శ్రీమతి షర్మిల బుధవారం రాత్రికి వీరభద్రపురంలో బస చేస్తారని రఘురాం, పద్మప్రియ తెలిపారు.