రామభద్రపురం వరకూ షర్మిల నేటి పాదయాత్ర
17 Jul, 2013 10:30 IST
మరడాం (విజయనగరం జిల్లా),
17 జూలై 2013: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 212వ రోజుకు చేరింది. ఈ రోజు ఆమె మొత్తం 16.2 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు. విజయనగరం జిల్లాలో పదవ రోజు కొనసాగే పాదయాత్ర వివరాలను పార్టీ కార్యక్రమాల కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ పెన్మెత్స సాంబశివరాజు వివరించారు. శ్రీమతి షర్మిల బుధవారం ఉదయం మరడాం, షికారుగంజి జంక్షన్, బూర్జవలస మీదుగా ఆరికతోట వరకూ పాదయాత్ర చేస్తారు. అక్కడ మధ్యాహ్న భోజన విరామం కోసం ఆగుతారు. భోజన విరామం అనంతరం బూసాయవలస మీదుగా నడిచి రామభద్రపురం చేరుకుంటారు. బుధవారం రాత్రికి శ్రీమతి షర్మిల రామభద్రపురంలో బస చేస్తారని రఘురాం, సాంబశివరాజు తెలిపారు.