ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలి

22 May, 2017 13:51 IST

విజయవాడః చంద్రబాబు తన మనమడి చేతికి బలపం ఇచ్చి టీడీపీ రౌడీలకు కత్తులిచ్చారని వైయస్సార్సీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, పైలా సోమినాయుడులు మండిపడ్డారు. నారాయణరెడ్డి హత్య కేసులో చంద్రబాబు, కేఈలను ఏ-1 ముద్దాయిలుగా చేర్చాలని డిమాండ్ చేశారు. పూర్తిస్థాయిలో విచారణ జరగాలంటే కేఈని పదవి నుంచి తొలగించాలన్నారు. కొంతమంది ఐపీఎస్ లు పచ్చచొక్కాలు వేసుకొని పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధిస్తేగానీ రాష్ట్రంలో హత్యాకాండ ఆగదని అన్నారు.