షర్మిల యాత్రకు అపూర్వ ఆదరణ
తెలంగాణలో శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు అపూర్వ ఆదరణ లభించిందని జిల్లా ఎన్నికల మున్సిపల్ పరిశీలకుడు, పాదయాత్ర సమన్వయ కమిటీ సభ్యులు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తెలిపారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎక్కడ చూసినా శ్రీమతి షర్మిలకు జనాలు ఎదురువచ్చి తమ కష్టసుఖాలు తెలుపుకుంటున్నారనీ, రానున్న కాలంలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని చెప్పారు. పాదయాత్ర రంగారెడ్డి జిల్లాలోకి అడుగిడనుందన్నారు. దేవుడి దయవల్ల శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి త్వరలోనే బెయిల్‌పై బయటకు వస్తారనీ.. ఆయన రాకకోసం జనమంతా ఎదురు చూస్తున్నారనీ పేర్కొన్నారు. రానున్న కాలంలో ఎలాంటి ఎన్నికలనైనా ఎదుర్కోవడానికి వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. 2014లో వైయస్‌ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి శ్రీ జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం తథ్యమని స్పష్టంచేశారు.