నరసన్నపేట నుంచి 222వ రోజు పాదయాత్ర
27 Jul, 2013 12:00 IST
శ్రీకాకుళం 27 జూలై 2013:
దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శనివారం 222వ రోజుకు చేరింది. ఉదయం నరసన్నపేట నుంచి ఆమె యాత్ర ప్రారంభించారు. నరసన్నపేట హైవే, రావాడపేట తిలారు, నారాయణవలస, లింగాలవలస, చల్లవానిపేట, గంగాధరపేట, జోనంకి గ్రామల మీదగా ఆమె పాదయాత్ర కొనసాగుతోంది.