షర్మిల పాదయాత్రకు బ్రహ్మరథం: అవినాశ్
2 Nov, 2012 10:28 IST
ఉరవకొండ:
అనంతపురం జిల్లాలో షర్మిల పాదయాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ యువజన విభాగం వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు వైయస్ అవినాశ్‌రెడ్డి చెప్పారు. మహానేత రాజన్న కూతుర్ని ఆశీర్వదించడానికి అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహం చూపుతున్నారని తెలిపారు. కూడేరు మండలం ముద్దలాపురం వద్ద గురువారం షర్మిల పాదయాత్రలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రను మరో ఓదార్పు యూత్రగా అభివర్ణించారు. పాదయాత్ర ప్రారంభం నుంచీ జనం వేలాదిగా తరలిరావడం గొప్ప విషయమని అభిప్రాయపడ్డారు.