షర్మిల నేటి పాదయాత్ర ఇలా..

6 Nov, 2012 09:58 IST
అనంతపురం:

మహానేత వైయస్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్‌ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర మంగళవారం వజ్రకరూరు నుంచి ప్రారంభమవుతుంది. కమలపాడు క్రాసు, కమలపాడు, గూళ్యపాల్యం, కొనకొండ్ల మీదుగా గుంతకల్లు సరిహద్దు వరకు కొనసాగుతుంది. కొనకొండ్ల బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం షర్మిల గుంతకల్లు సరిహద్దులోని ఐటీఐ కళాశాల వద్ద రాత్రి బస చేస్తారు. మంగళవారం 12.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగుతుందని కార్యక్రమ సమన్వయకర్త  తలశిల రఘురామ్, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ, సీఈసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. బుధవారం నాడు షర్మిల గుంతకల్లు పట్టణంలో పాదయాత్ర కొనసాగించి, రాత్రికి కసాపురం రోడ్డులో బస చేస్తారని వారు వివరించారు.