షర్మిల ఆదివారం పాదయాత్ర 12.5 కి.మీలు
4 Nov, 2012 10:05 IST
ఉరవకొండ
4 నవంబర్ 2012 : షర్మిల 'మరో ప్రజా ప్రస్థానం' పాదయాత్ర ఆదివారం అనంతపురం జిల్లా ఉరవకొండ మార్కె ట్ యార్డు నుంచి ప్రారంభమై 12.5 కిలోమీటర్ల మేర సాగుతుంది. గాలిమరల సర్కిల్, వజ్రకరూరు మండలంలోని పీసీ ప్యాపిలి క్రాస్, కడమలకుంట క్రాస్, హంద్రీ-నీవా కాలువ మీదుగా పాదయాత్ర రాగులపాడు చేరుతుంది. రాగులపాడులో ఏర్పా టు చేసిన బహిరంగ సభలో షర్మిల ప్రసంగిస్తారు. రాత్రి అక్కడే బస చేస్తారు. ఇదిలావుండగా షర్మిల పాదయాత్ర సోమవారం రాగులపాడు నుంచి పందికుంట, తట్రకల్లు, గంజికుంట మీదుగా వజ్రకరూరు వరకు సాగుతుంది. వజ్రకరూరులోని గాంధీ విగ్రహం వద్ద జరిగే ఒక బహిరంగ సభలో షర్మిల ప్రసంగిస్తారు. రాత్రి అక్కడే బస చేస్తారు. ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ శంకర్‌నారాయణ, సీఈసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి షర్మిల పాదయాత్ర వివరాలను మీడియాకు తెలియజేశారు