షర్మిల 82వ రోజు పాదయాత్ర ప్రారంభం
5 Mar, 2013 12:55 IST
సత్తెనపల్లి (గుంటూరు జిల్లా), 5 మార్చి 2013: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర 82వ రోజు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. వైయస్ అభిమానులు, పార్టీ శ్రేణుల ఆదరణ మధ్య ఆమె పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. సోమవారం రాత్రి బసచేసిన సత్తెనపల్లి శివారు వెంకటపతినగర్ నుంచి మంగళవారం ఉదయం శ్రీమతి షర్మిల పాదయాత్ర ప్రారంభించారు.
అక్కడి నుంచి శ్రీమతి ఇరుకుపాలెం నుంచి మాదాల మీదుగా బొల్లారం క్రాస్ చేరుకుంటారు. బొల్లారం క్రాస్ వద్ద భోజన విరామం అనంతరం చాగంటివారిపాలెం, ముప్పాల, గొల్లపాడు మీదుగా ఆమె పాదయాత్ర కొనసాగుతుందని పార్టీ గుంటూరు జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం తెలిపారు.
ఇరుకుపాలెంలో మహానేత విగ్రహం ఆవిష్కరణ:
గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం ఇరుకుపాలెంలో దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని శ్రీమతి షర్మిల మంగళవారం ఉదయం ఆవిష్కరించారు.