షర్మిల 21వ రోజు పాదయాత్ర ప్రారంభం
7 Nov, 2012 11:21 IST
అనంతపురం :
అనంతపురం జిల్లాలోని కొనకండ్ల నుంచి షర్మిల 21వ రోజు మరో ప్రజా ప్రస్థానాన్ని ప్రారంభించారు. మంగళవారం వరకు ఉరవకొండ నియోజకవర్గంలో పర్యటించిన ఆమె ఇవాళ్టి నుంచి గుంతకల్లు నియోజకవర్గంలో పాదయాత్ర చేపడతారు. షర్మిల ఇవాళ దాదాపు 10 కిలోమీటర్లు నడవనున్నారు. గుంతకల్లు శివార్లలో ఆమె రాత్రికి బస చేస్తారు.